ఓఆర్ఆర్ టెండర్ గోల్ మాల్.. కేసీఆర్ సర్కార్ పై మరో మరక
posted on May 5, 2023 @ 9:45AM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం .. టీఎస్పీఎస్సీ పేపర్ లేకేజి కుంభ కోణం.. ఇప్పుడు ..తాజాగా ఓఆర్ఆర్ కుంభకోణం. తెలంగాణలో జరిగిన కుంభకోణాలు ఇంకా ఉన్నా..ఈ మూడు కుంభకోణాల్లో ..ఒక కామన్ త్రెడ్’ కనిపిస్తుంది. అవును ఈ మూడు మేజర్ కుంభకోణాల్లో ముఖ్యమంత్రి .. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆఫ్కోర్స్ మిషన్ కాకతీయ, మిషన్ సిసన్ భగీరధ, మొదలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్ వంటి ప్రాజెక్టులు, పథకాలలో అవినీతికి సంబందించి వచ్చిన ఆరోపణలు అన్నిటిలో ముఖ్యమంత్రి కుతుమాబ్ సభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపించిన మాట నిజమే అయినా ఈడీ, సీబీఐ ఎంట్రీతో ఈ కేమూడు కేసులు రాజకీయంగానూ ప్రధాన్యత సంతరించుకున్నాయి.
నిజమే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద విశేషం కాదు. ఇంచు మించుగా 25 సంవత్సరాలకు కొంచెం అటూ ఇటుగా ముఖ్యమంత్రి, ప్రధాని వంటి కీలక పదవుల్లో ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరినీ, అధికారం గడప దాక కూడా రానీయని ప్రధాని మోడీ పైనే ఆరోపణలు వచ్చినప్పడు, పీవీ, మన్మోహన్ వంటి పెద్ద మనుషులకే అవినీతి మరకలు తప్ప నప్పుడు ... తెలంగాణలో ఏకంగా ఐదారుగురు కుటుంబ సభ్యులు అధికార పదవులు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ఫ్యామిలీ పై ఆరోపణలు రావడం విశేషం కాదు. అలాగే దళిత బంధు పథకం లబ్దిదారుల నుంచి మూడేసి లక్షలు (30 శాతం) లంచాలు పుచ్చుకున్న ఎమ్మెల్యేల చిట్టా చేతిలో పెట్టుకుని కూడా ... చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి కేసీఅర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటారు అనుకోవడం కుదిరే వ్యవహారం కాదు.
నిజమే కావచ్చును తన కొడుకు , కూతురు సహా ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రే స్వయంగా శాసన సభలో ప్రకటించి ఉండవచ్చును కానీ దళిత ముఖ్యమంత్రి హామీ లాగా అది జరగలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు.
అయితే ఇప్పడు ఓఅర్ఆర్ విషయంలో తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు. ఈ వ్యవహారంలో అటు నుంచి బీజేపీ ఇటు నుంచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు చేస్తున్న సవాళ్ళు సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. అంతే కాదు మళ్ళీ ఈ గోల్ మాల్ వ్యవహారంలోనూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు కేటీఆర్, కవితపై రోపణలు చేయడమే కాకుండా ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇందుకు సంబంధించి తాజగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను 30 సంవత్సరాల పాటు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రైవేటు కంపెనీకి లీజు ఇచ్చే విషయంపై కోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా లేఖ రాస్తామని స్పష్టం చేశారు.
మరో వంక రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి స్పందిచక పోవడం, అదే సమయంలో దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వారిని హెచ్చరించిన నేపధ్యంలో ప్రభుత్వం ఇంకా పలచనవుతోందని, అవినీతి ముద్ర ముఖ్య్మగా కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ప్రధాన ఎన్నికల అంశం మారే అవకాశం ఉందని అంటున్నారు.