నుమాయిష్ గడువు పొడగింపు
posted on Feb 13, 2024 @ 11:16AM
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనను మరో మూడు రోజులు కొనసాగించనున్నారు. సందర్శకుల డిమాండ్, ట్రేడర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ (ఏఐఐఈఎస్) ప్రకటించింది. దీంతో ఈ నెల 15తో ముగియనున్న నుమాయిష్ మరో మూడు రోజులు.. అంటే ఈ 18 వరకు కొనసాగనుంది. ఏఐఐఈఎస్ నిర్ణయంపై నుమాయిష్ సందర్శకులు, ట్రేడర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం ఏటా జనవరి 1న నుమాయిష్ మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. గడువు దగ్గర పడుతుండడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం సందర్శకుల రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. రద్దీ నేపథ్యంలో ప్రదర్శనను పొడిగించాలని ట్రేడర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆదివారం వరకు నుమాయిష్ ను కొనసాగించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది.ఈ సంవత్సరం, నాంపల్లిలోని నుమాయిష్ మైదాన్‌లో 45 రోజుల పాటు జరిగే వార్షిక ప్రదర్శన కోసం 2,400 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు సాయంత్రం 4:00 గంటల నుండి ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. వరకు అయితే, వారాంతాల్లో మరియు సెలవు దినాల్లో, నుమాయిష్ సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్ ధరలను, సందర్శన వేళలను మార్చలేదు. ఫిబ్రవరి 15 న హైదరాబాద్‌లో నుమాయిష్‌ను ముగించాలని ప్లాన్ చేసినప్పటికీ, వ్యవధిని పొడిగించే హక్కు మేనేజింగ్ కమిటీకి ఉంది.