ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుంది
posted on Jun 18, 2015 @ 3:00PM
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని తెగ తాపత్రయపడుతున్న తెరాస ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. నిన్నటి వరకూ పోన్ ట్యాపింగ్ జరగలేదు.. జరగలేదు అని మొత్తుకున్న తెరాస ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలన్నీ మావద్ద ఉన్నాయని చంద్రబాబు, మంత్రులు హెచ్చరించేసరికి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. "ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం.. ఇది ఒట్టి ఆరోపణ కాదు.. తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేశారన్న దానికి మావద్ద ఆధారాలు ఉన్నాయి దీంతో తెరాస ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని" చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెరాస నేతలలో వణుకుపుట్టించినట్టుంది. లేకపోతే అలా చంద్రబాబు హెచ్చరించేసరికి ఇలా కేసీఆర్ ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారమేదీ ఇవ్వడానికి వీలులేదంటూ అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేయడం అశ్చర్యకరం. అసలు వాళ్లు ఫోన్లు ట్యాపింగే చేయనప్పుడు సమాచారం ఇవ్వడానికి వీలులేదని ఎందుకు చెపుతారు. దానితో పాటు ఏపీ సర్కారుకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారంట.
మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య వాంగ్మూలం కూడా కీలకం కానుంది. చంద్రబాబును ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారని, చంద్రబాబు పేరు చెప్పాలని తనను బెదిరిస్తున్నారని.. రూ కోటి రూపాయలు తీసుకొని స్టీఫెన్ సన్ కు కేసీఆర్ ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారని చెప్పాడు. దీంతో ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనిని బట్టి కేసీఆర్ ఏదో చేయబోయి. ఏదో చేసి చంద్రబాబును ఇరికించబోయి తాను ఇరుక్కునేలా ఉన్నాడు.