మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ వారంట్
posted on Mar 3, 2023 @ 3:16PM
రాష్ట్రపరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో రైల్ రోకో లో పాల్గొన్న సందర్భంగా ఆయనపై నమోదైన ఒక కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ అయ్యింది.
2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ డిమాండ్ తో చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంలో అప్పటికి విపక్షంలో ఉన్న గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన అక్రమంగా రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించి విశాఖ, పలాస ప్యాసంజర్ రైలును నిలిపివేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయనపై కేసు నమోదైంది.
అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన గత నెల 27న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో రైల్వే న్యాయస్థానం గుడివాడ అమర్నాథ్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వే స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట ఆయనపై నమోదైన కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. 2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి ప్రవేశించి విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో గత నెల 27న న్యాయ స్థానంలో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.