ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేస్తేనే సౌకర్యాలు.. జగన్ సర్కార్ సైకో షరతులు!
posted on Jun 22, 2023 @ 3:23PM
జగన్ సర్కార్ లో సంక్షేమం అంద సుందరముదనష్టంగా అమలు అవుతోందో రోజుకో తార్కానం బయటపడుతూ ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానించే నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన పెదవాడి అన్నంగిన్నెగా తెలుగువారందరూ ఎంతో అభిమానించే ఎన్టీఆర్ గా అందరూ పిలుచుకునే నందమూరి తారకరామారావు. అటువంటి తారకరామారావు బొమ్మ ఉందని ఎన్టీఆర్ కాలనీలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా పనులు అర్ధంతరంగా నిలిపివేసింది జగన్ సర్కార్. ఎన్టీఆర్ ముందు చూపుతో ఏర్పాటైన వర్సిటీకి చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేస్తే ఆ పేరును కూడా మార్చేసింది జగన్ ప్రభుత్వం. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తే తప్ప ఇళ్లకు బిల్లులు ఇచ్చేది లేదనీ, పనులు ప్రారంభించేది లేదనీ స్పష్టం చేస్తోంది జగన్ సర్కార్.
వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి ఎన్టీఆర్ కాలనీలో 2015-16 సంవత్సరంలో 60 మంది పేదలకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఇళ్లు మంజూరు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ ఇళ్ల పనులను నిలిపివేసింది. అయిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఆపేసింది. బిల్లులు ఇచ్చి ఇళ్లకు నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి లబ్ధిదారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. దానికి తోడు కాలనీలో ఉన్న ఎన్నటీఆర్ విగ్రహాన్ని కూల్చివేస్తే అన్నీ అవే వచ్చేస్తాయంటూ వైసీపీ నేతలు చెప్పడంతో లబ్ధిదారులు హతాశులయ్యారు. అభిమానంతో ప్రేమగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని కూల్చేదే లేదని ఖరాకండీగా చెప్పేశారు. దీంతో గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కాలనీకి ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా నానా ఇబ్బందులూ పెడుతున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా వెంకటగిరి చేరుకున్నప్పుడు డక్కిలి ఎన్టీఆర్ కాలనీ వాసులు తమను వైసీపీ సర్కార్ వేధిస్తున్న తీరును వివరించారు.
ఎన్టీఆర్ బొమ్మ కూల్చేస్తే సౌకర్యాలు కల్పిస్తామనడం శాడిస్టు లక్షణమని లోకేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు తెలుగుదేశం ప్రభుత్వం అదనపు సాయం అందించి పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సైకో ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయనీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డక్కిలి ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు సకల సౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసి అందిస్తుందనీ హామీ ఇచ్చారు.