కొత్తబస్సుల కొనుగోలు అసాధ్యం..ఏపీ ఆర్టీసీ ఎండీ
posted on Sep 2, 2022 @ 12:35PM
ఆర్టీసీ ఆదాయం ఆశాజనకంగా లేదని, 50 శాతం డీజిల్‌కు ఖర్చుకాగా, మరో 40 శాతం నిర్వహణకు సిబ్బంది జీతాలకు రూ.300 కోట్లు అవుతోందని కనుక ఇప్పట్లో కొత్త బస్సులు కొనుగోలు అసాధ్యమని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత జీతభత్యాల వెసులుబాటు ఉన్నా ఆదాయం ఆశాజనకంగా లేద న్నారు. గత నెలలో ఆర్టీసీకి వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి 25 శాతం మేర రూ.124 కోట్లు చెల్లిం చామని తెలిపారు.
జూన్‌లో పిలిచిన టెండర్ల ద్వారా 339 అద్దెబస్సులు, ఆగష్టులో పిలిచిన టెండర్ల ద్వారా మరో 156 అద్దె బస్సులు ఖరారయ్యాయని తిరుమలరావు అన్నారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు డిమాండ్‌ఉందని గుర్తించాం. 62 అద్దెబస్సులకు టెండర్లు పిలవగా.. ఇప్పటి వరకు 30 బస్సులు వచ్చాయి. ఈ బస్సు లకు స్టార్ రైడర్ అనే పేరును ఖరారు చేశామన్నారు.
బీఓటీ విధానంలో ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా నిబంధనలను సవరించాం. గతం లో మాదిరిగా 33 ఏళ్లకు కాకుండా 15 ఏళ్ల పాటు ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు కొత్త పాలసీ తీసుకువచ్చామన్నారు. అలాగే, తెలంగాణకు బస్సులు పెంచేందుకు కృషిచేస్తామని, 18 రూట్లలో కొత్త బస్సులు పెంచామన్నారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు పెంచే ప్రతిపాదనలున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు ఏర్పాటు చేయనున్నాం.
ఈ నెల కొత్త పీఆర్‌సీ జీతాలలో కలపలేదని, సాంకేతిక కారణాలతో ఈ సమస్య ఏర్పడిందని, ప్రాంతీయ స్థాయిలో జీతాలు చెల్లించేందుకు వీలుగా అప్‌డేషన్ చేయాల్సి ఉండ టం వల్ల ఈ నెలలో కొత్త పీఆర్‌సీ కలపటం కుదరలేదని ఎండీ తిరుమలరావు తెలిపారు.