ఆరోగ్య సంక్షేమానికి అంతంతే!!
posted on Feb 2, 2022 @ 9:30AM
కేంద్ర బడ్జెట్ లో ఎదో అద్భుతం జరుగుతుందని ఆశించిన మధ్యతరగతికి తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ప్రజా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవడం పై ఆరోగ్య రంగానిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్ భారిన పడ్డ సామాన్యుడు ఆరోగ్యపరంగా కుదేలై పోయిన వాళ్లకు వైద్యం అయినా సామాన్యుడికి అందించేందుకు వైద్యం , వైద్య రంగసేవలు వంటి వైద్య ఉత్పత్తులపై రాయితీలు దిగుమతి సుంకం తగ్గ వచ్చన్న అంచనా తలకిందులు చేస్తూ అందరి అంచనాలకు భిన్నంగా సీతారామన్ విద్యారంగాన్ని ప్రజాఆరోగ్యానికి తీవ్ర నిరాశ మిగిల్చినదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైద్య రంగం పరిశ్రమ పై కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందన వెలువడింది. బడ్జెట్ 2౦22 లో వైద్యరంగం పై ఎదో కొంత బూస్ట్ ఇచ్చినట్లుగా ఉందని నిపుణులు వ్యాక్యా నిస్తున్నారు. బడ్జెట్ లో ఇతర అత్యవసర సేవల పై బడ్జెట్ లో దృష్టి పెట్టకపోవడం పై ఆరోగ్య రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి కి గురియ్యారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా రామాన్ మాట్లాడుతూ 2౦ 22 బడ్జెట్ లో కోవిడ్ 19 వల్ల చాలా మంది అన్నివయసుల వాళ్ళు మనైకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ను ప్రకటించారు. ఇందులో 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్ల ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ నోడల్ కేంద్రం గా ఉంటుందని నిర్మల ఆమె బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. నాణ్యమైన మానసిక ఆరోగ్యం కౌన్సిలింగ్ సేవలు ఎన్ టి ఎం హెచ్ పి ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కౌన్సిలింగ్ సేవలకు గాను ఐ ఐ టి బెంగళూరు సంకేతిక సహకారం తో మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కు సహకరిస్తుందని తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎకో సిస్టం కు అందరికీ ఆహ్వానం అంటూ ఆర్ధిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ రిజిస్ట్రీ స్ ను హెల్త్ ప్రొవైడర్స్ ఆరోగ్య సౌకర్యాలు గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల కల్పనా 95 % నుండి 112 % జిల్లాలలో ఆరోగ్యం మెరుగుపడిందని జిల్లాల పై దృష్టి సారించాలని అని అనడం చూస్తే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరని ప్రభుత్వ ఉద్దేశ్యం గా తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యరంగానికి కేటాయింపుల విషయం లో నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేసారు. ఆరోగ్యానికి విద్యకు కేటాయించిన బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని అన్నారు. రోడ్లు, పోర్ట్లు నిరక్షరాస్యులకు తెలియవని అనారోగ్యం తో ఉన్నవారికి అవి వారి అవసరం తీర్చవని నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు. అత్యవసర సమాయం లో ఆరోగ్య రంగం లో సరైన వైద్య విధానమంటూ లేకనే వైద్యవిధానం అంటూ లేకపోవడం ప్రభుత్వానికి హెల్త్ పాలసీ అంటూ లేకపోవడం వల్లే మనం కోవిడ్ ను ఎదుర్కోవడం లో తీవ్రంగా విఫలమయ్యామని అత్యవసర సాయంలో సైతం ఏ చికిత్సకు ఏ పరికరాలు ఉన్నాయి కూడా తెలియదని, గ్రామీణ ప్రాంతలాలో ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని వాటి గురించిన కనీసపు ఆలోచన వైద్య ఆరోగ్య శాఖ కు లేకపోవడం ప్రభుత్వం విద్యారంగానికి ఏ మేరకు చిత్త శుద్ధి ఉందొ ఆర్ధం అవుతుందని నిపుణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
బడ్జెట్ లో ఉత్పదకరంగం పై నిర్లక్ష్యానికి గురి అయ్యిందని కోవిడ్ సనయంలో అవసరమైన వైద్య పరికరాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. టెలి మెడిసిన్ కు ప్రాధాన్యత రిగిందని కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ వై ద్యరంగానికి కొన్నేళ్లుగా జీ డి పి లో 3 % కేటాయింపులు ఉత్త్జుతివే అని అవి ప్రకటనలకే పరిమితంయ్యిందని. నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య విద్యపై బడ్జెట్ కేటాయింపులు జీ డి పి లో 2. 5 % గత సంవత్సరం 1 37 % వై ద్యరంగానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట అంటూ పతాక శీర్షికలో ప్రచురితమయ్యాయి. 22 -23 సంవత్సరం లో నాణ్యమైన వైద్యం అన్డుంచే ఆశ సామాన్యుడికి లేకుండా పోయింది. వైద్య సేవల పై నియంత్రణ వైద్య ఉత్పతుల పై నియంత్రణ లేకుంటే సామాన్యుడికి వైద్యం అన్డుయ్తుందా ? ఎవరికీ సంత్రుప్త్జి నివ్వని బడ్జెట్ కేవలం తూ తూ మంత్రంగా మాత్రమే నిర్వహుంచి నట్లిందని పసలేని బడ్జెట్ గా నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి మొండి చెయ్యి.