నిత్యానంద ఆన్ లైన్ లీలలు
posted on Nov 12, 2012 @ 1:08PM
నిత్యానంద ఎక్కుడున్నాడో తెలీదు. ఎలా ఉన్నాడో తెలీదు.. పోలీసులు కాషాయం కట్టుకున్న ఆ కొంటె కృష్ణుణ్ణి పట్టుకోవడానికి నానా తిప్పలూ పడుతున్నారు. కానీ.. నిత్యానంద ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న స్వామివారు మళ్లీ ప్రపంచానికి ప్రకటితమయ్యేవరకూ దందా ఎందుకు బంద్ చేసుకోవాలనుకున్నారో ఏమో.. భక్తుల్ని ఆన్ లైన్ లోనే కరుణిస్తూ వరాల్ని కురిపిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో ఉన్న నిత్యానంద ఆశ్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విచిత్రం బైటపడింది. వరసగా లైన్లో వెళ్లి వెయ్యి రూపాయల ఫీజు సమర్పించుకుని టీవీ ఎదురుగా కూర్చుంటే నిత్యానంద దర్శనం దొరుకుతుంది. ముందుగా ఎంపిక చేసుకున్న సమస్యని అడిగితే ఆయనకు తోచిన సమాధానం చెబుతారు. అంతే అక్కడితో వంతు పూర్తై మరొకరికి ఛాన్స్ వస్తుంది.
మామూలుగా నిత్యానంద దర్శనం ఇంటర్ నెట్ లోకూడా దొరుకుతోంది.. కానీ.. ఆ దర్శనంలో కేవలం నిత్యానందని భక్తులు చూసే వీలుమాత్రం ఉంది. అదే ఆశ్రమానికి వెళ్లి ఆన్ లైన్ దర్శనం పొందితే ఆయనతో మాట్లాడే వీలుకూడా ఉంటుంది. పైగా సమస్యని నేరుగా విన్నవించుకునే అవకాశం కూడా..
ఈ విషయంగురించి తెలుసుకున్నవాళ్లు అంతా బాగానే ఉంది గానీ.. స్వామివారి పక్కన రంజిత స్వామిని కూడా ఉంటే అదీ.. ఇద్దరూ రాసలీలలు చూపిస్తే వెయ్యేంటి పదివేలైనా పెట్టడానికి రెడీ అంటున్నారట.