పెడద్రోవ పడుతున్న టెక్నికల్ నాలెడ్జ్
posted on Nov 11, 2012 @ 2:34PM
వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో మరోసారి హైటెక్ కాపీయింగ్ బట్టబయలైంది. వైద్యవిద్య సంస్థల్లో చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కూ దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఇందులో సీటు కోసం పోటీ పడతారు. పీజీఐలోని వివిధ విభాగాల్లో పేజీ వైద్యకోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కూ పాల్పడుతూ చండీగఢ్ లో పలు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వైద్య విద్యార్ధినులు పట్టుబడ్డారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
పీజీఐఎంఈఆర్ లో ఎండీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో కాపీ జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని సీబీఐ డిఐజీ మహేష్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడి నాలుగు పరీక్షా కేంద్రాల్లో బ్లూటూత్ సహా అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్ధినులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఓ విద్యార్ధిని చెవిలో సూక్ష్మ పరికరాన్ని అమర్చుకొందని, ఆమెకు శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాల్సి ఉందని వివరించారు. ఇందుకు పీజీఐఎంఈఆర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. నిందుతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కుంభకోణానికి సంబందించి హైదరాబాద్, పాట్నా నగరాలలో పలువురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
యువత ఇలాంటి పెడ దోరణలకు అలవాటు పడకుండా వాళ్ళని మంచి మార్గంలో మళ్ళించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు తెలుగువన్.కాం "ఓక మంచి మాట" పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నడుపుతోంది. కౌన్సుల్లింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ వంగావరపు రవికుమార్ ఆధ్వర్యంలో "టోరి"లో యువతకు సలహాలు సూచనలు ఇస్తూ మార్గ నిర్దేశం చేసే కార్య క్రమాన్ని ప్రసారం చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమాన్నికి ఆదరణ లబిస్తుంది.