నితీశ్ కటారా హత్య కేసు.. సుప్రీం తుది తీర్పు..
posted on Oct 3, 2016 @ 11:17AM
బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నితీశ్ కటారా హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈకేసులో నిందితులకు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం.. నితీశ్ కటారా.. యూపీకి చెందిన డీపీ యాదవ్ కుమార్తె భారతీ యాదవ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఆమె సోదరులైన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు తెలియడంతో వారు.. వారి ప్రేమను వ్యతిరేకించారు. దీంతో పగపెంచుకున్న వికాస్ యాదవ్, విశాల్ యాదవ్.. తన స్నేహితుడైన సుఖ్ దేవ్ సహకారంతో ఓ వివాహానికి హాజరైన నితీశ్ ను కిడ్నాప్ చేసి, సుత్తితో విచక్షణారహితంగా కొట్టి, డీజిల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అయితే మూడు రోజుల తరువాత నితీశ్ మృతదేహం బయటపడటంతో దానిని పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది నితీశ్ కటారా మృతదేహమే అని తేలింది. ఇక కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖ్ దేవ్ పహిల్వాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వారికి 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అయితే శిక్ష తగ్గించాలని వారు సుప్రీంను ఆశ్రయించగా దీనిపై విచారించిన కోర్టు, ఉరిశిక్ష వేయలేమని స్పష్టం చేస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది.