రాజధాని నుండి పాలన.. సర్వం సిద్దం..
posted on Oct 3, 2016 @ 11:48AM
నూతన సచివాలయం నుండి పరిపాలను సర్వం సిద్దం అయినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 3 నుండి ఏపీ నూతన రాజధాని అమరావతి నుండే పాలన సాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ నుండి వెయ్యిమంది ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లారు. ఈరోజు నుండే వారు విధుల్లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక సచివాలయంలో ఉద్యోగులు వర్క్ స్టేషన్లు, ఐఏఎస్ ల ఛాంబర్ల ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఫైనాన్స్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబధించిన ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే ఆదివారం ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి పలు కార్యాలయాల సామగ్రిని తరలించారు. ఎంజే మార్కెట్‌లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏపీకి చెందిన కార్యాలయ టేబుళ్లు, కుర్చీలు, ఫైల్స్, కంప్యూటర్లు, ఫ్యాన్‌లు, ఏసీలు ఇతర సామగ్రిని 18 డీసీఎం వాహనాలలో తరలించింది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏపీ డీఎంఈ, డీహెచ్, వైద్య విధాన పరిషత్ కార్యాలయాలు కూడా ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్తున్నాయి.