తెలుగు రాష్ట్రాల్లో ఎన్ ఐఏ సోదాలు
posted on Sep 18, 2022 @ 10:19AM
ఇది కనీవినీ ఎరుగనిది. సాధార ణంగా ఉగ్రకార్యకలాపాలు అన గానే ఉత్తరప్రదేశ్, బీహార్ లేదా ఇటు దక్షిణాదిన హైదరా బాద్‌తో సంబంధాల గురించే వార్తలు వస్తుంటాయి, ఎన్ ఐఏ సోదాలు భారీ ఎత్తున చేపట్టడం జరుగు తూంటుంది. కానీ మొదటిసారి గా ఆంధ్రా, తెలంగాణా జిల్లా ల్లోనూ సోదాలు చేపట్టడం విం టున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్య కలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుం టూరు జిల్లాల్లో దాడులు చేప ట్టింది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా..కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిపై పోలీ సులు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహి స్తోంది. మతకలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.
పీపుల్స్ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహి స్తున్నారు. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో అబ్ధుల్ ఖాదీర్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 200 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. కేరళ, ఢిల్లీ, కర్ణాటకలతో కూడా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
అదేవిధంగా నిర్మల్ జిల్లా బైంసాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మదీనా కాలనీలో అధికారులు సోదాలు చేపడుతున్నారు. రాత్రి మూడు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పీపుల్స్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ దాడులు నిర్వహించి అనుమానితులను అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.