స్పీడ్ న్యూస్ 1
posted on Jul 13, 2023 @ 11:20AM
1.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటల 35 నిమిషాలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది.
2. భారత రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో భారీగా పెరిగింది. అంతకుముందు నెలలో 4.31గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్భణం జూన్ నెలలో 4.81కి చేరుకుంది.
3.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.
4.తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో టీటీడీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఒక బాలుడిపై చిరుత దాడి తెలిసిన విషయమే.
5.సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బుధవారం మరో ఇద్దరు అరెస్టయ్యారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్, అతని కూతురు సాహితీలను ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
6. ముఖ్యమంత్రి జగన్ కొంతకాలంగా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని జగన్ ను పవన్ నిలదీశారు. తాడేపల్లిగూడెం లో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని మాట్లాడారు.
7. జగన్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాలలో నాశనం అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో బాబు మాట్లాడారు. రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించే ప్రభుత్వం కావాలని మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు చెప్పారు.
8.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
9.రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కృష్ణంరాజు మృతి చెందారు.
10.వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
11. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపానికి వరదనీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు.
12.మరో రెండేళ్లలో ఇంటర్నెట్ అంతమైపోతుందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో వచ్చిన కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంటర్నెట్‌లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
13. వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ చాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రిమల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, తనను కూడా బ్లాక్ మెయిల్ చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
14.రాజస్థాన్‌లో దారుణం జరిగింది. హత్యకేసు నిందితులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న ఓ ముఠా పోలీసుల కళ్లలో కారం చల్లి నిందితులపై కాల్పులు జరిపింది.
15.వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడారు. కేవలం 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్ అయింది.
16.భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసింది.
17.స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టారు. ఆపై టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
18. హర్యానాలో అసాధారణ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది.
19.అదుపుతప్పిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బాల్యాన్ని చిదిమేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది.
20. కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.