స్పీడ్ న్యూస్ -2
posted on Jul 11, 2023 @ 4:53PM
26.అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
27. తెలంగాణ రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్ అందిస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏడుపు ఎందుకని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రైతులపై మీకు, మీ పార్టీకి కక్ష ఎందుకని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
28.మహారాష్ట్రలోని నాసిక్ లో కొంతమంది దొంగలు ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లారు. దర్జాగా లారీ తీసుకొచ్చి, మెషిన్ ను అందులోకి ఎక్కించి తీసుకెళ్లారు.
29. ఆగస్టు 1న పూణెలో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డును ప్రధాని మోదీ అందుకోబోతున్నారు. లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అందిస్తున్న ఈ అవార్డు కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు అజిత్ కలిసి కనిపించనుండడం అదే తొలిసారి అవుతుంది.
30.ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి వారితో పొదిలి నుంచి కాకినాడకు వెళ్తున్న బస్సు దర్శి సమీపంలో అదుపుతప్పి సాగర్ కాల్వలో పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది గాయపడ్డారు.
31.అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
32.పవన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేని ఏపీ ప్రభుత్వ నేతలు వాలంటీర్లను రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఉసిగొల్పారు. ప్రతిపక్ష పార్టీల ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది.
33.ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. నేపాల్‌లో జరిగిందీ ఘటన. మేనేజింగ్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్ 9ఎన్-ఏఎంవీ (ఏఎస్ 50) సోలుకుంబు నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా చాపర్ అదృశ్యమైంది. హెలికాప్టర్‌లో పైలట్‌తోపాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. ఈ ఉదయం 10.12 గంటలకు అది రాడార్ నుంచి అదృశ్యమైంది.
34. హెలికాప్టర్ అదృశ్యం కాగానే రంగంలోకి దిగిన అధికారులు దానిని వెతికేందుకు మరో హెలికాప్టర్‌ను పంపారు. అయితే హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే దానితో సంబంధాలు తెగిపోయాయని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
35. టెక్ కంపెనీల్లో గతేడాది మొదలైన కొలువుల కోతలు ఇటీవల కొంత నెమ్మదించాయి. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటుండగానే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్‌లకు తెరలేపి వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది.
36. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ మాటలు వ్యక్తిగతమని, ఆయన చెప్తే ఫైనల్ కాదన్నారు.
37. దర్శి దుర్ఘటన మానవ తప్పిదమా? లేక ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణమా అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలని జన సేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
క్షతగాత్రులకు మేలైన వైద్య సదుపాయం కలిగించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా సాయపడాలని కోరారు.
38. ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ ‘ఎక్స్ టర్’ ను సోమవారం మార్కెట్ కు పరిచయం చేసింది.
39. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు.
40. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి తమకు వచ్చే పెన్షన్ తోపాటు కొంత సొంత డబ్బు కలిపి రూ.5 వేల విరాళాన్నిటీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేశ్ కు అందజేశారు.
41. దర్శి ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
42.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు ఖర్చు చేసి రీడెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్ లా మారిపోయింది.
43.: వైసీపీ పార్టీ జగన్‌ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని లాక్కున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
44.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.
45. ఇంటర్మీడియట్‌లో పరీక్షా పేపర్ మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఓ విద్యార్థి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు విద్యార్థి పరీక్ష పత్రాలను పున: సమీక్షించాలంటూ ఇంటర్మీడియట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.