స్పీడ్ న్యూస్ 3
posted on Jul 5, 2023 @ 4:38PM
1జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖలలో మొత్తం 86 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
2.సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత ఫుట్ బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) చాంపియన్‌షిప్ లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఏకంగా తొమ్మిదోసారి ట్రోఫీ గెలిచి తమకు తిరుగులేదని నిరూపించింది.
3.తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సీఐ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే తెల్లవారుజామున నాలుగు గంటలకే సీఐ ఇంటికి పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
4.ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో విష వాయువు లీక్ కావడం భయాందోళనలు సృష్టించింది. వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
5ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.
6.గిరిజన కూలీపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టిలో పడడంతో నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
7. మోదీ ఇంటి పేరుతో గత లోక్ సభ ఎన్నికల్లో తీవ్రఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మంగళవారం ఊరట దక్కింది. వ్యక్తిగత హాజరు నుండి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి ఝార్ఖండ్ హైకోర్టు మినహాయింపును ఇచ్చింది.
8. తన ఫొటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫొటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.
9. తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా, అరెస్ట్ చేసి జైల్లో వేసినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది ఇండిపెండెంట్'కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనను వాళ్లు మళ్లీ జైల్లో పెడతారని తనకు తెలుసునని అన్నారు.
10.మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు స్వయంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశీస్సులు ఉండవచ్చునని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అనుమానం వ్యక్తం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీని చీల్చి, రాష్ట్రంలోని శివసేన-బిజెపి ప్రభుత్వంలో ఆదివారం ఎ