స్పీడ్ న్యూస్ - 5
posted on Jul 4, 2023 @ 4:48PM
41.గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాలోనూ పరిస్థితులు సజావుగా ఉన్నాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు రష్యా అధీనంలోని భూభాగాల్లో కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.
42. సోషల్ మీడియాలో ఓ చేపకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీని పేరు హెయిర్ టెయిల్ ఫిష్. ప్రపంచవ్యాప్తంగా ఇది శీతల ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని సముద్ర జలాల్లో కనిపిస్తుంది.
43.చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచారు.
44. ఇన్స్టాగ్రామ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ షేక్ చేస్తున్నారు. సోషల్ మీడియా చరిత్రలోనే పవన్ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కల్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను ఓపెన్ చేశారు.
45. కేరళపై నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
46. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.
47.తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జన గర్జన సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలన్న సంకల్పంతో ప్రజలు ప్రభుత్వ అడ్డంకులు తొలగించుకొని మరీ సభకు వచ్చారన్నారు.
48. రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి తిప్పికొట్టారు. ‘‘పరిపక్వత లేని నేతలు బీఆర్‌ఎస్ వాళ్లే అని ఆయన ఎద్దేవా చేశారు.
49. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది.
50. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. పురందేశ్వరి, కిషన్ రెడ్డిలను తెలుగు రాష్ట్రాలను అధ్యక్షులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించినట్టు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.