స్పీడ్ న్యూస్- 4
posted on Jul 4, 2023 @ 2:01PM
31. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్, సీఎం జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని అన్నారు.
32.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం మెుదైలంది. నాయకత్వం మార్పు, పదవుల విషయమై నేతల అసంతృప్తి, రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు ఇలా పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
33. మరోకొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.,మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటాపోటీగా ప్రకటనలు చేస్తుండటంతో.. దుబ్బాక పాలిటిక్స్ ఇప్పటినుంచే రసవత్తరంగా మారుతున్నాయి.
34.ఏడాదిన్నరగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందుకొచ్చింది. 3 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీని ఐఎంఎఫ్ శుక్రవారం అందజేసింది.
35.తమిళనాడు ఏంటి.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇప్పుడు కాదులేగానీ.. మరో ఏడేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది.
36.ఎన్సీపీలో ముసలంతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండుగా చీలిపోయిన ఎన్సీపీలో పోటాపోటీగా తొలగింపులు, నియామకాలు జరిగాయి.
38.ఇటీవలి కాలంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులపై.. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ కాలేజీలో విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
39. మన దేశం నుంచి కూడా చాలా మంది పర్యాటకులు థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రోడ్డు మార్గంలో కూడా థాయిలాండ్ చేరుకోవచ్చని తెలిపింది.
40.మెట్రో ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు ఎత్తివేసిన హైదరాబాద్ మెట్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. మెట్రో మాల్స్, వారికి కేటాయించిన కొన్ని స్థలాల్లో ఇప్పటివరకు ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తోన్న హైదరాబాద్ మెట్రో.. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది.