స్పీడ్ న్యూస్- 3
posted on Jul 4, 2023 @ 12:59PM
21.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా ఫోన్ చేశారు.
22.దేశ వ్యాప్తంగా టమోటా ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా ధర సెంచరీ నుంచి డబుల్ సెంచరీ వరకూ వెళ్లింది.
23.టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు రూరల్ లో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ... యాత్రలో రద్దీ ఎక్కువ కావడం వల్లే తాను తిరిగి వచ్చానని చెప్పారు.
25.ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో 43 ఏళ్ల వయసులో 24వ సారి బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కు చుక్కెదురైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో అతి పెద్ద వయస్కురాలైన వీనస్ తొలి రౌండ్ లోనే ఓడిపోయి నిరాశ పరిచింది.
26.యాషెస్ సిరీస్ రెండో టెస్టులో రనౌట్ దుమారం సద్దుమణగడం లేదు. ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టోను వివాదాస్పదంగా ఔట్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
27.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని... ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నారు.
28.దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దత్తతకు మునుపే ఆస్తి పంపకాలు పూర్తయితేనే పుట్టింట కుటుంబంలో ఆస్తి హక్కు దక్కుతుందని పేర్కొంది.
29. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరి మధ్య చెక్ బౌన్స్ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. మాజీ మంత్రి వినోద్ కుమార్ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
30.పూనమ్ పోస్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ డైరెక్టర్‌ను గురూజీ అని పిలుస్తారు. ఆయన్నే టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.