స్పీడ్ న్యూస్- 4
posted on Jun 29, 2023 @ 5:19PM
31.బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు నేడు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలతో ప్రజలకు అసౌకర్యం కలగకూడదని లక్నో ఈద్గా ఇమామ్ స్కాలర్, మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.
32.ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశానికి అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలుపై కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. మోదీ చెపుతున్న ఉమ్మడి ఎంతవరకు ఉమ్మడిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
33.కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది.
34.టీమిండియా కోచ్‌లపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌ల పేరు ప్రతిష్ఠలకు క్రికెటర్లే కారణం అన్నాడు.
35.బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గొర్రెలకు డిమాండ్ పెరిగింది. తాజాగా రాజస్థాన్‌లో చూరూ జిల్లాలో ఓ పొట్టేలు ఏకంగా రూ.కోటి ధర పలికింది.
36.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని కర్టాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత బియ్యానికి బదులు నగదును అందిస్తామని సిద్ద రామయ్య ప్రభుత్వం తెలిపింది.
37.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు.
38.కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ప్రణామ్, యూరియో గోల్డ్ స్కీమ్ ల కొనసాగింపునకు పచ్చజెండా ఊపింది.
39.కాంతి కిరణాల సాయంతో ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేసే సరికొత్త లేజర్ టెక్నాలజీ కాలిఫోర్నియాలోని ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ లేజర్ ఆధారిత ఇంటర్నెట్ సాంకేతికతను అభివృద్ధి చేసింది.
40.అమెరికాలో ఓ వ్యక్తికి అద్భుతమైన ఆఫర్ లభించింది. విమానంలో ఫస్ట్ క్లాస్ లో, అది కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది.