స్పీడ్ న్యూస్- 3
posted on Jun 29, 2023 @ 5:04PM
21.ఉమ్మడి పౌర స్మృతికి తమ పార్టీ సూత్రప్రాయ మద్దతు తెలుపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపాకే ముందుడగు వేయాలన్నారు.
22.చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్‌లో 45 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్సై బెదిరింపులకు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినందుకు కేసులు పెట్టారు.
23.తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు.
24.రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానని సీఎం జగన్ చెప్పుకోవడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ కుటుంబంలో కూడా జగన్ వంటి మేనమామ ఉండకూడదని అన్నారు.
25.ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతపరమైన అంశాలపై ఫిలింమేకర్లు సినిమాలు తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది.
26.ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచ కప్ నెగ్గిన క్షణాలను వీరేంద్ర సెహ్వాగ్ పంచుకున్నాడు. సచిన్ ను భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో మొత్తం కలియదిరిగారు.
27.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ అప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
28.ఇక నుంచి తాను పాత పద్ధతిలో మాట్లాడనని, ఇక నుంచి కొత్త పద్ధతిలో మాట్లాడతానని జన సేన అధినేత వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక నుంచి ఇలా ఇలా ఇలా అని మాట్లాడుతా ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కనుక్కుందాం అని వ్యాఖ్యానించారు.
29. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు లేక, రోజంతా ఆటో తోలినా ఆశించిన డబ్బులు రాక ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు.
30. తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు.