స్పీడ్ న్యూస్- 2
posted on Jun 29, 2023 @ 3:43PM
11.చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు.
12.దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన నగరారం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 65 కిలో మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
13.ఢిల్లీ మెట్రో ఇటీవల తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. రైలులో అసభ్యకర చేష్టలు.. ముద్దుసీన్లు, డ్యాన్సింగ్ రీల్స్‌తో తరచూ దర్శనమిస్తున్నాయి.
14.వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటజరిగింది. బుధవారం పొద్దుపోయాక జరిగిన ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
15.ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ కదులుతోందనే భయంతోనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీగల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమో, మెట్రో రైలు కోసమో, కంటోన్మెంట్ రోడ్ల కోసమో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం లేదని విమర్శించారు.
16.తనకు నచ్చి, పది మందికి ఉపయోగపడుతుందని, ఆలోచించేలా చేస్తుందని భావిస్తే చాలు.. అది ఫొటో అయినా, వీడియో అయినా, సందేశం అయినా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో తన కోటి మంది ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఆయన ఓ గ్రామంలోని ఇంటిలో స్థలం ఆదా చేసుకునే దానికి సంబంధించి ఫొటోని షేర్ చేశారు.
17.అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన సబ్‌మెర్సిబుల్ ‘టైటాన్’ శకలాలను తీరానికి తీసుకొచ్చారు. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రాడార్ ఫ్రావిన్సులోని సెయింట్ జాన్స్ ఓడరేవుకు నిన్న వాటిని తీసుకొచ్చారు.
18. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. జూలై 12 నుండి 19 మధ్యన చేపట్టనున్నట్లు చెప్పారు.
19.హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక్కసారిగా భూమి కుంగడంతో స్థానికంగా కలకలం రేగింది. గౌతమ్ నగర్ కాలనీలోని ఓ సంస్థ భవనం నిర్మాణ పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు.
20.పాకిస్థాన్ విధానాన్ని భారత విదేశాంగ మంత్రి తప్పుబట్టారు. రాత్రి ఉగ్రవాదం నడిపించే దేశంతో పగలు వాణిజ్యం చేయలేమని తేల్చి చెప్పేశారు.