సంక్షిప్త వార్తలు
posted on Jun 26, 2023 @ 2:56PM
1. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ బీజేపీ కోవర్ట్ అని ఆయన అన్నారు.
2. టీడీపీ యువనేత నారా లోకేశ్ కు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్ముంటే నెల్లూరులో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
3.కేంద్ర సర్కారు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) లో మార్పులు చేయనుందని సమాచారం. ఉద్యోగులు తమ సర్వీసులో చివరిగా డ్రా చేసిన వేతనంలో కనీసం 40 శాతాన్ని పెన్షన్ గా పొందే విధంగా నిబంధనలు మార్చనుంది.
4.హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేతలిద్దరూ నిన్న నాగర్ కర్నూలులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న సభకు గైర్హాజరు కావడం ఇందుకు ఊతమిస్తోంది.
5. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వరంగల్ జిల్లాలో బీజేపీ నేతల మధ్య సఖ్యత కొరవడి నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి డ్యామేజ్ కలిగించే స్థాయికి చేరింది.
6. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో ఆయన రోడ్డు మార్గంలో పయనమయ్యారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
7.గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడ్డాయి.
8.తనంటే అమితమైన విశ్వాసం చూపించే పెంపుడు కుక్క అంటే ఆ వ్యక్తికి ప్రాణం. కానీ, కుటుంబసభ్యులు మాత్రం కుక్కను ఇంట్లోంచి గెంటేయాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ఇది నచ్చని ఆ వ్యక్తి తన కుక్కను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు.
9. బీజేపీ నేత, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఐదు నెలలుగా చేస్తున్న ఆందోళనను రెజర్లు విరమించారు. ఇకపై కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు.
10.‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పంజాబీ మోడల్ నీలమ్ గిల్ మరోమారు కెమెరాలకు దొరికిపోయారు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి.
11.కుటుంబ బాధ్యతలను భార్య చక్కబెట్టడం వల్లే ఒత్తిడి లేకుండా భర్త బయటకు వెళ్లి పనిచేయగలడని.. అంటే భర్త సంపాదనకు పరోక్షంగా భార్య సహకరిస్తుందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల భర్త సంపాదించిన ప్రతీ ఆస్తిలోనూ భార్యకు సమాన వాటా ఉంటుందని స్పష్టం చేసింది.
12. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని ఐదున్నర కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరి తలపై జగన్ రూ. 1.80 లక్షల కోట్ల అప్పును పెట్టారని అన్నారు.
13.వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్‌మోహన్ రెడ్డి అవుతారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ‘‘రాజారెడ్డి ఏమైనా విలనా? ఆయన రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డిని అందించారు’’ అని అన్నారు.
14. గత కొంతకాలంగా వివిధ పర్యటనలకు టీమిండియాను ప్రకటించినప్పుడల్లా సర్ఫరాజ్ ఖాన్ పేరు తెరపైకి వస్తూనే ఉంది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వర్షం కురిపిస్తూ, వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న ముంబయి బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటిదాకా జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
15.రాజోలు నియోజకవర్గం మలికిపురం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సభకు వస్తుంటే మహేశ్ బాబు అభిమాని ఒకరు తనను కలిశారని వెల్లడించారు.
16. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సాయంత్రం ఆయన పాదయాత్ర నాయుడుపేట చేరుకుంది.
17. టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. వెల్లువెత్తుతున్న విమర్శల మధ్యే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
18. ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ఈజిప్టు పర్యటనలో ఉన్న మోదీని అక్కడి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైల్ తో సత్కరించింది.
19.నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
20. డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడైన అంశాలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. బిగ్ బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి, నటి జ్యోతి, నటి సురేఖవాణిల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
21. ఇటీవలే టీడీపీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ పరిణామాలపై స్పందించారు. టీడీపీ తొలి విడత మేనిఫెస్టోకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు.
22. లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండైంది. ఆ తర్వాత విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించడంతో అందులోని 350 మంది ప్రయాణికులు 5 గంటలపాటు విమానంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.
23.హిమాచల్ ప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు నదుల్లో నీటి ప్రవాహం పెరిగిపోయింది.
24.సరిగ్గా 40 ఏళ్ల కిందట టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్..‘ఒరిజినల్ కెప్టెన్ కూల్’ అని గవాస్కర్ అన్నాడు. ‘‘1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బంతితోనూ అదరగొట్టాడు.
25.ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి ఎక్కువమంది ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఫహాద్ ఫాజిల్ .. షైన్ టామ్ చాకో వంటి వారు ప్రేక్షకులకు చేరువైతే, త్వరలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తెలుగు తెరపై కనిపించనున్నాడు.