ఫాలో ఆన్ గండంలో న్యూజిలాండ్...
posted on Oct 10, 2016 @ 2:50PM
ఇండోర్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కాస్త తడబాటుతోనే ఆడుతూ వికెట్లు కోల్పోతుంది. లంచ్ తర్వాత కేవలం 23 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. అశ్విన్ 4, జడేజా ఒక వికెట్ తీసుకోగా.. గప్టిల్ రనౌటయ్యాడు. ఒక దశలో 148 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కివీస్‌ను నీషమ్ (37 నాటౌట్), వాట్లింగ్ (23) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించడంతో కివీస్ కాస్త కోలుకున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన నేపథ్యంలో, ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయట పడాలంటే న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులను దాటాల్సి వుంది. అయితే ఇప్పటికీ ఇంకా ఫాలోఆన్ గండం గట్టెక్కాలంటే న్యూజిలాండ్ 141 పరుగులు చేయాల్సి ఉంది.