మైక్రోసాఫ్ట్ సరికొత్త మొబైల్ మోడల్స్



మైక్రోసాఫ్ట్ సంస్థ మరో రెండు కొత్త మొబైల్ మోడల్స్ లూమియా 640, లూమియా 640 xL లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. లూమియా 640 ధర రూ. 11,999 లూమియా 640 xL ధర 15,799 గా ఉన్నాయి. రెండు మోడల్స్ ఎల్టీఈ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో మాత్రం ఈ ఎల్టీఈ వెర్షన్ అందుబాటులో లేదని మైక్రోసాఫ్ట్ మొబైల్స్ డైరెక్టర్ టీఎస్ (సౌత్) శ్రీధర్ తెలిపారు. కాగా లూమియా 640 మాత్రం ఆన్ లైన్ సైట్ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా మాత్రమే విక్రయించబడుతుంది. లూమియా 640 xL బయట మొబైల్ మార్కెట్లో దొరుకుతోంది.

లూమియా 640 ప్రత్యేకతులు:

* డ్యుయల్ సిమ్
* 5 అంగుళాల డిస్ ప్లే
* 1.2 GHz క్వాడ్ కోర్ క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
* 8.1 లూమియా డెనిమ్ ఓఎస్
* 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 1 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 8 జీబీ ఇంటర్నల్ మెమరీ

లూమియా 640 XL ప్రత్యేకతులు:

* 5.7 అంగుళాల డిస్ ప్లే
* 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 1.2 GHz క్వాడ్ కోర్ క్వాలికమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్