ఆనం కుటుంబంలో చిచ్చు
posted on Mar 6, 2012 @ 9:49AM
నెల్లూరుజిల్లా : నెల్లూరుజిల్లా రాజకీయాలను శాపిస్తున్న ఆనం కుటుంబంలో చిచ్చు రగిలింది. నలుగురు ఆనం సోదరులు ఇప్పటిదాకా జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలను శాపించారు. అయితే హఠాత్తుగా ఉప ఎన్నికల ,ముందు సోదరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం జయకుమార్ రెడ్డి మిగిలిన అన్నదమ్ములకు దూరంగా ఉంటున్నారు. స్వతంత్రంగా ఎదిగే ఆలోచనల్లో భాగంగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. జయకుమార్ రెడ్డి కొంతకాలంగా తన అన్న ఆనం వివేకానందరెడ్డికి మొహం చూపించడంలేదు. కుటుంబ పెద్దగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా, నియంతృత్వధోరణిలో వుంటున్నాయనేది జయకుమార్ రెడ్డి ఆరోపణ. దీనికితోడు ఆనం వివేకానందరెడ్డికి నెల్లూరుజిల్లా పార్టీలోనే కొంత అసమ్మతి ఉంది. ఈ అసమ్మతివాదులంతా ఆనం జయకుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ఉపఎన్నికలు, మరోవైపు కార్పోరేషన్ ఎన్నికలు, రెండేళ్ళలో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆనం కుటుంబంలో విభేదాలు రావడం కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బగా భావించవచ్చు.