డిప్యూటీ కలెక్టర్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే..
posted on Aug 17, 2016 @ 10:27AM
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజాప్రతినిధులకు ఒక విలువ ఉంది. ప్రజలు వాళ్లకెంత గౌరవాన్ని ఇస్తారో ప్రభుత్వాధికారులకు అంతే గౌరవాన్ని ఇస్తారు. అయితే చాలామంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులపై చేయి చేసుకున్న ఘటనలు భారత రాజకీయ చరిత్రలో కోకొల్లలు. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రజాప్రతినిధి డిప్యూటీ కలెక్టర్‌పై చేయిచేసుకున్నాడు. ఓ ఆయిల్ పైప్‌లైన్ వేయడంతో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయమై డిప్యూటీ కలెక్టర్ అభయ్ కల్ గుద్కర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్‌లాడ్ హాజరయ్యారు. అయితే భూమికి నష్టంగా భూమే కావాలంటూ రైతులు పట్టుబట్టడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే సురేశ్ లాడ్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు మరో అధికారిని చొక్కాలు పట్టుకుని చెంపలు వాయించాడు. అయితే ఈ ఘటనపై అధికారులిద్దరూ కిక్కురుమనలేదు..అంతేకాకుండా ఫిర్యాదు కూడా చేయలేదు.