నయీమ్ బాడీగార్డ్స్‌గా యువతులు
posted on Aug 16, 2016 @ 11:15AM
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ చనిపోకముందు..చనిపోయిన తర్వాత ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాడు. అతడు బతికున్న రోజుల్లో దౌర్జన్యాలకు బలైపోయిన ఒక్కొక్క బాధితుడు ఇప్పుడు బయటకు వస్తుండటంతో నయీమ్ గురించి వెలుగు చూడని నిజాలు బయటకు వస్తున్నాయి. అలా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అదేంటంటే నయీమ్ చుట్టూ 20 ఏళ్ల వయసున్న యువతులు కాపలాగా ఉంటారట. అతడి డెన్‌లో నాలుగు గంటలపాటు అతనికి నరకం చూపించారట. ఒక్క మాటలో చెప్పాలంటే నయీమ్‌కు వారే సైన్యం. తనకు కాపలాగా యువతులతో మూడంచల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.
అందుకు నయీమ్ ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ముంబైకి చెందిన కొందరు అమ్మాయిలను రప్పించేవాడు. వారికి కొందరు నిపుణులతో ఆయుధాలు వాడటంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించాడని సమాచారం. తన భద్రతతో పాటు, కొన్ని హత్యల బాధ్యతలను కూడా వారికే అప్పగించేవాడట నయీమ్. గతంలో ఈ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన కోనవురి రాములు హత్య కేసులోనూ నయీమ్ గ్యాంగ్‌లోని ఒక మహిళ కీలకపాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.