వీడిన నావీ అధికారి కుమార్తె మిస్టరీ..
posted on Jun 18, 2016 @ 12:51PM
నావీ అధికారి అరవింద్ కుమార్ కుమార్తె ఖైరవీ శర్మ మిస్సింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఈనెల 14న విశాఖ నుంచి పుణెకు వెళుతూ, మార్గ మధ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె, అక్కడి నుంచి పుణెకు విమానం ఎక్కలేదు. అక్కడి నుండి ఆమె ఎటు వెళ్లిందో కూడా తెలియలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక తానే ఎటైనా వెళ్లిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. స్నేహితులు, ప్రయాణికులు, ఫేస్ బుక్ స్నేహితులు... ఇలా అందర్నీ విచారిస్తూ పోలీసులు ముందుకి సాగడంతో ఆమె ఎక్కడుందో తెలిసింది. ఖైరవీ శర్మ గోవా బీచ్ లో పోలీసులకి దొరికింది. దీంతో ఆమెను గుర్తించిన పోలీసులు, ఆమె తండ్రి, నేవీ అధికారి అరవింద్ కుమార్ కు అప్పగించారు. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.