నరేంద్ర మోదీ, మనోహర్‌పారికర్‌లను చంపుతాం.. ఐసిస్
posted on Jan 19, 2016 @ 2:36PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌లను చంపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు వీరిద్దరిని చంపుతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. అయితే ఈ లేఖ రాసిన వారి చిరనామా గురించి ఏం లేదుకాని లేఖపై మాత్రం ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ) ఉగ్రవాద సంస్థ సంతకం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ లేఖను అన్ని పోలీస్ స్టేషన్లకి పంపి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ కేసును యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ కు(ఏటీఎస్) అప్పగించినట్టు.. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలోని అన్ని ఏజెన్సీలూ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయని త్వరలోనే బెదిరింపు లేఖ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. లేఖలో గోవధ నిషేధంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు పోలీసులు వెల్లడించారు.