హెచ్‌సీయూకి రాహుల్ గాంధీ.. నేలపై రాహుల్ గాంధీ..
posted on Jan 19, 2016 @ 1:55PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్నారు. రెండు రోజుల క్రితం దళిత విద్యార్ధి రోహిత్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగిందో అన్న వివరాలు తెలుసుకుంటున్నారు. రాహుల్ గాంధీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నేలపై కూర్చొని సస్పెండైన నలుగురు విద్యార్థులతో మాట్లాడి.. వారిని కొన్ని ప్రశ్నలు వేసి వివరాలు సేకరించారు. అనంతరం రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించి.. రోహిత్ చిత్రపటానికి, స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీతోపాటు దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇంకా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ యూనివర్శిటీల్లో మతతత్వ శక్తులపై పోరాటానికి విద్యార్థి సంఘాలు ఏకం కావాలని
పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో వీసీలను ఆరెస్సెస్, బిజెపిలు నియమిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. చదువులకు బదులుగా ఓ విద్యార్థి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు.