ఈసారి చంచల్ గూడా కాదు.. ఫారిన్ జైలుకే
posted on Mar 6, 2021 @ 11:15AM
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జాతీయ మీడియాలో జగన్ సర్కార్ పై వచ్చిన కథనాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేసారు. ఎపి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు కేవలం తనపై ఉన్న కేసుల మాఫీకోసమేనని తేలిపోయిందని ఎద్దేవా చేసారు. తాజాగా నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే జగన్ అండ్ డెకాయిట్ బ్యాచ్‌కు మరోసారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోందన్నారు. అయితే తాజాగా కొంతమంది విదేశీయులు జగన్ రెడ్డి గ్యాంగ్ ఆర్థిక నేరాలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఈసారి చంచల్ గూడా కాకుండా.. విదేశీ జైల్యూక్ వెళతారని లోకేష్ అన్నారు.
అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎపి సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని కొన్ని విదేశీ సంస్థలు ఆరోపణలు చేసాయి. సీఎం జగన్‌కు దగ్గరగా ఉండే వ్యక్తులు, ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవాళ్లు విదేశాల్లో లెక్కపెట్టలేనన్ని డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీఎం అనుచరులు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని విదేశాల నుండి పిర్యాదులు, ఆరోపణలు రావడంతో కేంద్రం వాటి సంగతి తేల్చేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించినట్లుగా వార్తలు వస్తున్నాయి.