నాడు జగన్.. నేడు లోకేష్.. అంతా సేమ్ టు సేమ్
posted on Jun 19, 2020 @ 6:53PM
అది 2017 జనవరి 26 న ప్రత్యేక హోదా అంశం పై ఆందోళన లో పాల్గొనేందుకు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ విశాఖకు వెళ్లగా ఎయిర్ పోర్ట్ లో ఆయనను అడ్డుకున్నపోలీసులను ఉద్దేశించి "ఇంకా రెండే రెండు సంవత్సరాలు.. అందరినీ గుర్తుపెట్టుకుంటాను. ఎవ్వరినీ మరిచిపోను" అంటూ ఫైర్ అయ్యారు. తర్వాత రెండేళ్లు కష్ట పడి పాదయాత్ర చేసి ఏపీకి సీఎం అయ్యారు.
సీన్ కట్ చేస్తే.. 2020..
"అన్నీ రాసుకున్నాం వడ్డీతో సహా చెల్లిస్తాం ఎవరిని వదిలిపెట్టం. మమ్మల్ని మీరేం పీకలేరు" ఈ మాటలన్నది మరెవరో కాదు వైసిపి నేతలు తరచూ పప్పు అని ఎగతాళి చేసే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. గత కొంత కాలంగా టీడీపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ వారిని పలు కేసులలో ఇరికించి ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మొన్న తాడిపత్రిలో జెసి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఎపి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. అంతే కాదు అయన మాటల్లో తడబాటు స్థానం లో ఒక పరిపక్వత.. ఆవేశం కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను అయన ఇరకాటంలో పెడుతున్నారు. చంద్రబాబు తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి అని సందేహ పడే వారందరికీ అయన తాజాగా వ్యవహరిస్తున్న తీరు జవాబు చెపుతున్నట్లుగా కనిపిస్తోంది. అధికార పక్షం వేధింపులతో సతమతమవుతున్నపార్టీ కేడర్ కు నిత్యం అండగా ఉంటూనే తాజాగా అగ్రెసివ్ మూడ్ లో ఉన్న లోకేష్ ని చూసి టీడీపీ కేడర్ ఐతే ఫుల్ జోష్ లో ఉంది. ఫైబర్ గ్రిడ్ కు సంబంధించిన సెట్ టాప్ బాక్సుల్లో అవినీతి జరిగిందనీ, అందులో లోకేశ్ ప్రమేయముందనీ అధికార వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపైనా ఆయన ఫైర్ అయ్యారు. ఫైబర్ గ్రిడ్ ఐటీ శాఖ పరిధిలోకి రాదనే విషయం వైసీపీ నేతలకు తెలియకపోవటం శోచనీయమని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు అధికారం చెలాయిస్తుండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయనన్నారు. ఈ విధంగా లోకేశ్ దూకుడు పెంచడం టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపింది.