సీమాంధ్రకు ఉందిలే మంచికాలం ముందుముందునా: మురళీమోహన్
posted on May 19, 2014 @ 11:12AM
రాష్ట్ర విభజన కారణంగా సీమంధ్ర దారుణంగా నష్టపోయింది. ఈ నష్టం ఎప్పటికి తీరుతుందోనన్న ఆందోళన సీమాంధ్రులలో మొన్నటి వరకు వుంది. అయితే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ వుండటంతో ఇప్పుడు సీమాంధ్రులలో వున్న భయాందోళనలను తొలగిపోతున్నాయి. ఉందిలే మంచి కాలం ముందుముందునా అనే నమ్మకం వారిలో కలిగింది. ఈ విషయాన్నే నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చెబుతున్నారు. సీమాంధ్రకు మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు రావడానికి ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సీమాంధ్రను అభివృద్ధి చేసుకోడానికి అందరం కలిసి కృషి చేద్దామన్నారు.సీమాంధ్ర అభివృద్దికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి వుంటానని ఆయన అన్నారు. తన విజయం టీడీపీ పార్టీ స్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు అంకితమిస్తున్నట్లు మురళీమోహన్ ప్రకటించారు.