వాళ్లేమి టెర్రరిస్టులు కాదు అణచివేయడానికి.. రాఘవులు
posted on Jul 15, 2015 @ 6:27PM
మున్సిపల్ కార్మికులు వారం రోజుల నుండి సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒక పక్క కార్మికుల సమ్మెతో రోడ్లు మొత్తం చెత్తతో నిండిపోయిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రభుత్వం వారిని పట్టించుకోకపోగా వారి సమ్మెను పోలీసుల సాయంతో భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై సీపీఎం నేత బివి రాఘవులు స్పందించి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏం బాలేదని.. వాళ్లేమి టెర్రరిస్టులు కాదు పోలీలుసు, సైన్యాన్ని దించి అణచివేయడానికి అని అన్నారు. మున్సిపల్ శాఖ కేసీఆర్ హయాంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అన్ని శాఖలకు వేతనం పెంచిన కేసీఆర్ మున్సిపల్ కార్మికులు అడిగిన వేతనం ఇవ్వడానికి ఏమైందని.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే వాళ్లు వేతనం డిమాండ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కార్మికుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు సిధ్దంగా ఉంటారని తెలిపారు.