నిజాయితీని చాటుకున్న ఆటోవాలా...
posted on Jun 21, 2016 @ 4:44PM
ఎవరు బకరా దొరుకుతారా.. ఎవరిని మోసం చేద్దామా.. ఎవరి దగ్గర దోచుకుందామా అని చూసే రోజులు ఇవి. అలాంటిది ఓ ఆటోవాలా మాత్రం తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలో గుడ్డు గుప్తా అనే వ్యక్తి ఆటోవాలాగా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఓ భార్యభర్తలు ఇద్దరు అతని ఆటో ఎక్కి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వద్ద దిగారు. అయితే వారు దిగారు కానీ వారి లగేజీ మాత్రం మర్చిపోయారు. వారు తమ ఆటోలో లగేజీని మరిచిపోవడం గుప్తా రాత్రి గమనించాడు. ఎలాగైనా లగేజీ వారికి అందించాలని గుప్తా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ కు చేరుకుని, అక్కడి పోలీసు అధికారులకు చెప్పాడు. దీంతో పోలీసులు వివరాలు సేకరించి.. లగేజీ మర్చిపోయిన వారిని కనుగొని వారి సామాను వారికి అందించారు.
ఈ సందర్బంగా తమ లగేజీ తమకు తిరిగి ఇచ్చినందుకు ఆటోవాలాకు ధన్యావాదాలు తెలుపుతున్నామని.. బంగారు ఆభరణాలు, రూ.3,000 నగదు, ఇన్సూరెన్స్ పేపర్లు తమ సూట్ కేసులో ఉన్నాయని ముక్తార్ అహ్మద్ చెప్పారు.