Read more!

ములాయం దారి తప్పాడు: లాలూప్రసాద్

 

 

 

రేప్ నేరం కాదంటూ ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయ వర్గాల నుంచి కూడా నిరసన మొదలవుతోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ములాయం చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవని, బాధ్యతారహితంగా వున్నాయని ఆయన చెప్పారు. ములాయం మాట్లాడిన మాటలను వింటుంటే ఆయన నైతికంగా దారితప్పిన విషయం అర్థమవుతోందని లాలూ విమర్శించారు.