ముద్రగడ దీక్షపై అచ్చెన్నాయుడు.. అభిమానుల సంబరాలు..
posted on Feb 8, 2016 @ 2:43PM
కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన డిమాండ్లకు గాను ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి.. ఆయనతో రాజకీయ నేతలు దీక్ష విరమణ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముద్రగడతో చర్చలు సానుకూలంగా జరిగాయని.. చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారని వెల్లడించారు. అంతేకాదు కాపులను బీసీల్లో చేర్చే విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది..వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరామని అచ్చెన్నాయుడు తెలిపారు.
మరోవైపు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడంతో కిర్లంపూడిలో ముద్రగడ నివాసం ఎదుట బాణా సంచా కాలుస్తూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.