రసాయనాల కంపెనీలో అగ్నిప్రమాదం… ఆరుగురి మృతి!
posted on Feb 8, 2016 @ 2:08PM
హైదరాబాదుకి అతి సమీపంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని మంకాళ్ పారిశ్రామికవాడలో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. హాసిత అనే రసాయనాల కర్మాగారంలో వేర్వేరు రసాయనాలను కలుపుతుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన నలుగురు కార్మికులతో సహా మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. హాసిత కర్మాగారానికి సరైన లైసెన్స్ కానీ ఇతరత్రా అనుమతులు కానీ లేవనీ… దాదాపు ఎనిమిది నెలల కిందటే వీరిని సంస్థను మూసివేయమని చెప్పినా కూడా అనధికారికంగా కర్మాగారాన్ని నడుపుతున్నారనీ తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యుడైన తీగల కృష్ణారెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నవారిని పరమామర్శించారు. మృతులు కుటుంబాలకు కనీసం 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యాన్ని హెచ్చరించారు!