ఎమ్మార్ కేసులో 4గో అరెస్టుకు రంగం సిద్దం?
posted on Jan 30, 2012 @ 1:44PM
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితుడుగా పేర్కొన్న ఏపీఐఐసీ ఎండీగా పనిచేసిన బీపీ ఆచార్య, ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న బీపి ఆచార్య సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఎమ్మార్ కేసులో ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్న ప్రస్తుత తరుణలో సీబీఐ బీపీ ఆచార్యను రప్పించడంతో ఆయనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య ఎ-1 నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఎమ్మార్ కుంభకోణంలో బీపీ ఆచార్య పాత్ర ఉన్నదంటూ గత ఏడాది ఆగస్టు 17న ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టును అధికారికంగా సిబిఐ ప్రకటించనప్పటికీ అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లుగా సమాచారం. మరో మూడు నాలుగు రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సిన సమయంలో బిపి ఆచార్యను అరెస్టు చేయడం గమనార్హం. ఆ ఎమ్మార్ విల్లాల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఆచార్య పట్టించుకోలేదనీ, చూసీచూడనట్లు వ్యవహరించారని సీబీఐ అభియోగం. కాగా ఆయనను అరెస్టు చేసేందుకు కేంద్రస్థాయిలో అనుమతులకోసం సీబీఐ ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఎమ్మార్ కేసులో ఇది నాలుగో అరెస్టు అవుతుంది.