ఏయ్.. ఎవడ్రా నువ్వు.. మహిళతో ట్రాప్ చేస్తావా?
posted on May 10, 2021 @ 2:54PM
తనను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు. తనను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా మనుషులను కూడా నియమించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై నోటికొచ్చినట్టు కారు కూతలు కూయడం అందులో భాగమేనన్నారు. తనకు రోజూ వందలాది కాల్స్ చేసి.. అసహనానికి గురి చేసి.. తనపై కేసులు పెడదామని ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని చెప్పారు రఘురామ.
ఇదంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేయిస్తున్నారంటూ ఆయనపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఏయ్ సజ్జల.. ఎవడ్రా నువ్వు.. ఆఫ్ట్రాల్ నువ్వో జర్నలిస్ట్.. అనధికార హోంమంత్రిలా వ్యవహరిస్తున్నావు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ వ్యవహారాలు చేస్తున్నావు. బుద్ధి తెచ్చుకో.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కోర్టులు ఉన్నాయి. మీ వెదవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దు. సజ్జల, వైఎస్ జగన్.. మీ పరిధిల్లో ఉండండి. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోకండి’’ అని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు
‘‘నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ. నీ దగ్గర నా మనుషులు కూడా ఉన్నార్రా. సజ్జల... సారీ బిజ్జల దిశానిర్దేశంతో.. నన్ను అసహనానికి గురి చేసి కేసులు వేద్దామని ప్లాన్ చేసినట్టు వాళ్లు చెప్పారు’’ అని ఆయన అన్నారు.
‘‘నీ ప్రభుత్వం పతనావస్థలో ఉంది. మీ కుట్రలను త్వరలోనే బయటపెడతాను. సైబర్ క్రైమ్ పోలీసులకు నా వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపాను. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశానన్నారు రఘురామ.
మరోవైపు.. సీఎం జగన్‌పైనా ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. జగన్ పిచ్చివాడంటూ సంచలన కామెంట్లు చేశారు. విపక్ష నేతలపై, తనపై కేసులు పెట్టడం పిచ్చి చర్యకాకపోతే మరేంటని ప్రశ్నించారు. ‘‘కాబోయే సీజేఐపై కూడా ఫిర్యాదు చేశావ్.. ఇది పిచ్చి చర్య కాదా.. ఎక్కువ కాలం ఇది సాగదు. పాలకుడు పిచ్చివాడైతే పాలించే అర్హత లేదని రాజ్యాంగం చెబుతోంది. జగన్ పరీక్ష చేయించుకోవాలి.. పిచ్చివాడని తేలితే పాలించే అధికారం మరొకరికి ఇవ్వాలి. లేకపోతే నువ్వు పిచ్చివాడివని కేసు నమోదు చేసి విచారణ జరపాల్సి ఉంటుంది. ఇది వాస్తవ ఆరోపణ.. నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని రఘురామ అన్నారు. కరోనా విలయతాండవం వేస్తుంటే.. ప్రజలు వ్యాక్సిన్లకోసం పడిగాపులుగాస్తుంటే.. కనీసం సమీక్షంచడం లేదంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు రఘురామ.