ఏపీలో అత్యంత కాలుష్య నగరం విశాఖపట్నం
posted on Nov 9, 2022 8:42AM
ఏపీలో అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం నిలిచింది. గాలి నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కాలుష్య నియంత్రణ బోర్డు దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 163 నగరాలకు సంబంధించిన వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఏపీలో అత్యంత కాలుష్య నగరంగా ఆ జాబితాలో చోటు చేసుకుంది. ఇంకా రాష్ట్రంలో రాజమహేద్రవరం, ఏలూరు, తిరుపతి, అనంతపురం నగరాలలో కూడా గాలి నాణ్యత తగినంత స్థాయిలో లేదని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇక దేశంలో అత్యంత కాలుష్య నగరం రాజధాని ఢిల్లీ మహానగరం అనుకుంటాం, కానీ ఈ సారి ఆ స్థానాన్ని బీహార్ లోని కటిహార్ నగరానికి దక్కింది.
2.40 లక్షల జనాభా గల ఈ నగరంలో గాలి నాణ్యత 360 పాయింట్లకు పడిపోయినట్లు సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. ఆ తరువాతి స్థానాలలో వరుసగా ఢిల్లీ (354 పాయింట్లు), నోయిడా (328), గాజియాబాద్ (304) నగరాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో కాలుష్య నగరంగా హైదరాబాద్ తన గుర్తింపును నిలబెట్టుకుంది.