వంశీకి ఇప్పట్లో బెయిలు కష్టమే!?

గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్థం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే. ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఏ1 గా ఉన్న ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు అరెస్టు చేశారు.

రంగాను మంగళవారం (మార్చి 25) రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ఓలుపల్లి మోహన్ రంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడు. దీంతో గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వల్లభనేని వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు. ఎందుకంటే తొలుత గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో వంశీ పేరు లేదు. అయితే తరువాత వరుసగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించిన సందర్భంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో  ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అలా చేర్చిన తరువాతే అరెస్టు భయంతో ఈ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ ఆ క్రమంలో నిండా మునిగారు.

కిడ్నాప్ కేసులో అరెస్టై జైలుపాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో వంశీకి కుడి భుజంగా చెప్పుకునే మోహన్ రంగా పోలీసులకు చిక్కడంతో  వంశీకి  గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పెండింగులో ఉంది. ఇక కిడ్నాప్ కేసులో వంశీ బెయిలు పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇప్పుడు వంశీ కుడిభుజం మోహన్ రంగా అరెస్టుతో.. వంశీకి బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు. కిడ్నాప్ కేసులో ఒక వేళ బెయిలు దొరికినా.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో మాత్రం ఇప్పట్లో బెయిలు లభించే అవకాశాలు దాదాపు లేనట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా మోహన్ రంగా అరెస్టుతో వంశీకి మరిన్ని చిక్కులు తప్పవని అంటున్నారు. 

Teluguone gnews banner