కోతులకు కూడా కుటుంబ నియంత్రణ.. ఎక్కడ..?
posted on Aug 5, 2016 @ 11:53AM
సాధారణంగా జనాభా పెరుగుతున్నందుకు కుటుంబనియంత్రణలు చేస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కోతులకు కూడా కుటుంబ నియంత్రణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆగ్రాలో కోతుల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. అదిలించిన వారిపై దాడికి దిగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8వేల కోతులు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఆరేళ్లలో ఆగ్రాలో కోతుల సంఖ్య 2.16 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందుకే ముందు జాగ్రత్తగా వీటికి కుటుంబ నియంత్రణ చేపట్టాలని ఓ స్వచ్ఛంద సంస్థ భావించింది. దీనిలో భాగంగానే ఆగ్రా అధికారులు కలిసి కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ వ్యాక్సిన్‌లను ఇస్తున్నారు. గత మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగష్టు చివరి నాటికి 500 కోతులకు వ్యాక్సినేషన్, స్టెరిలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు ఇప్పటి దాకా 317 కోతులకు ఈ ప్రక్రియ పూర్తి చేశారు.