మోదీజీ ... ఇది మీకు తగునా!
posted on Sep 18, 2022 9:05AM
పిల్లవాడి పుట్టినరోజు. పక్కింటి పిన్నిగారు, మామ్మగారుతో పాటు అంతా వచ్చారు. పిల్లడికి కేక్ తినిపించారు. మీవాడు బా వుంటాడు, బాగా అల్లరి చేస్తాడు అంటూ తోటి అమ్మలక్కలంతా ఆ పిల్లవాడి తల్లికి చెబుతూనే కాస్తంత కంట్రోల్‌లో పెట్టుకో మ్మా.. మరీ బాగుంటది అనీ చిన్నగా వాడి బుగ్గ గల్లి మరీ వెళ్లారు. ఇలా ఉంది మోదీ ప్రభుత్వ వ్యవహారం. ఆవేశం, ఆగ్రహం, దూకుడు.. ఎక్కడ చూపించాలో, ఆయా సందర్భాల్లో అక్కడే ప్రదర్శంచాలి. కేవలం ప్రశాంతంగా ఉన్నచోట గొడవలు, విభేదాలు సృష్టించి తగుదునమ్మా అంటూ వచ్చి ప్రబోధచేసి పాలకుడు మంచివాడు కాదంటూ ఉపన్యాసాలు దంచి అధికారం చేజిక్కిం చుకునే కుయుక్తులు రాజకీయంగా అంత మంచిది కాదు. ఇది చూచాయిగా బీజేపీ వారికి విపక్షాలన్నీ కలిసి బోధిస్తున్న బ్రహ్మ సూత్రం. చిత్రమేమంటే ఇది బీజేపీ వారికీ బాగా ఎరుకే. కాని పాటించనవసరం లేదన్నది వారి నియమం. దీని కి ఎవరి నుంచి సమాధానం ఉండదు. మూర్ఖత్వం నిలువెల్లా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా ఎక్కదంటారు పెద్దలు. అదే పంథాలో మోదీ సర్కార్ పరుగులు పెడుతోంది, ఆవేశపడుతోంది.
పులులతో ఫోటోలు, పరుగులు కాకుండా కాస్తంత నిమ్మళంగా ఉండాలి. తమ పాలన లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని అమాంతం దింపేసి మనోళ్లని పెట్టుకుని పాలన సాగించాలనుకోవడమే పొరపాటు. అన్నిచోట్లా ఇది సాగదు. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ కులలో ఒకరిగా తరచు వార్తల్లో ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువ మొయిత్రా శనివారంనాడు ఆయ నకు ఒక ట్వీట్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలి పారు. ఇదే సమయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేగంగా అంతరించి పోతున్న రాజ్యాంగ రక్షణను ప్రస్తావించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతరించి పోతున్న చిరుత పులుల విషయంలో ఏమి చేశారో అదే విధంగా అంతరించిపోతున్న రాజ్యాంగ విలువలను కూడా పునరుద్ధరించాలి అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం అధికార ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యా స్త్రాలు సంధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు చిరాయువు ప్రసాదించాలి. ఈ దేశ యువతకు మీరు చాలా చేశారు. ఈరోజు జాతీయ నిరుద్యోగ దినోత్సవం జరుపుకోవడానికి ఇదో కారణం. ఈ దేశంలోని ప్రతి నిరుద్యోగి మీకు రుణ పడి ఉంటారని భారత జాతీయ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖమంత్రి కె.చంద్రశేఖరరావు తదితరులు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ కేక్ తినేముందు, శుభా కాంక్షల ట్వీట్ చదివిన తర్వాత కాస్తంత పాలనావ్యవహారాల పద్ధతిని సరిచూసుకోవాలన్న హెచ్చరికను గుర్తుచేశారు.
ఇటీవలి కాలంలో దేశంలో అందరి వ్యవహారాల్లోనూ తలదూర్చి ఏదో రహస్యం కనుగుని ఈడీ,సిబిఐ అధికారులను గిల్లి మరీ పంపడం బతుకు గందరగోళం చేయడం అనే ఆటలు బాగా ఆడుతున్నారు బీజీపీవారు. అవతలివాడిని గిల్లి ఆనందించే స్కూలు స్థాయి ఆనందం వారికి ఇంకా పోలేదు. ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు పెట్టి అధికారం చేజిక్కించుకునే నైజం బాగా ప్రదర్శిస్తు న్నారు. అంతే తప్ప దేశ పరిస్థితులు, ప్రజల ఆర్ధిక, సామాజిక, విద్యా,ఉద్యోగ రంగాల్లో పరిస్థితులను అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు విదేశీ సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయని బీజేపీ వందిమాగదుల బాకాలు చెవికి ఇంపుగా ఉంటే మోదీ నిద్రిస్తున్నారన్నది అందరికీ అర్ధమైంది.
తాజాగా షాంగైలో జరుగుతున్న ఎస్‌సీఎస్ సదస్సులో ఆయన చైనా, పాక్ నేతలతో ఎడమొగం పెడమొగంగానే వ్యవహరిం చారు. కారణం వారిద్దరు దేశానికి పక్కలో బల్లెలుగా మారారని. కానీ దేశంలో ప్రజలతో మాత్రం అబ్బే వారు మనకు మంచి మిత్రులే అంటూంటారు. చైనా వ్యవహారమే తీసుకుందాం.. పైకి దొంగ నవ్వులు నవ్వుతూనే సరిహద్దుల్లో ఆక్రమణలు చేస్తూనే ఉన్నారు, సైనిక విన్యాసాలూ సాగిస్తున్నారు. ప్రధాని మోదీకి మాత్రం అదేదో బచ్చన్ సినిమాలా అనిపిస్తోంది.
తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణ పడినప్పుడు మే ప్రారంభంలో భారత్ , చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్త తలు మరింత హింసాత్మకంగా మారాయి. దేశం ఒక కమాండింగ్ అధికారితో సహా 20 మంది సైనికులను కోల్పోయింది. 45 ఏళ్ల తర్వాత చైనాతో జరిగిన మొదటి హింసాత్మక ఘర్షణ తర్వాత మరో వైపు కూడా ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం తెలిపింది. ప్రపంచ వార్తల్లో కరోనావైరస్ సంక్షోభం ఆధిపత్యం చెలాయించినప్పటికీ, భారత్-చైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు ఒక నెలకు పైగా ముఖ్యాంశాలుగా మారాయి. సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇంతకుముందు కుదిరిన ఏకాభి ప్రాయం చైనా నిర్లక్ష్యం చేసినప్పటికీ, దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను నిర్ధారించడానికి కట్టు బడి ఉన్నామని భారత్ తెలిపింది.