మోడీ ప్రధాని అవుతారు: అద్వానీ
posted on Apr 5, 2014 @ 3:51PM
భారత రాజకీయాలలో పెద్దమనిషి, బీజేపీలో పెద్ద దిక్కు లాల్ కృష్ణ అద్వానీ తన మసులో వున్న మాటని బయటపెట్టారు. ఈ ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయమని అద్వానీ చెప్పారు. అద్వానీ ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం భారతీయ జనతాపార్టీ వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తోంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని పార్టీ ప్రకటించినప్పుడు అద్వానీ హర్టయ్యారు. ఆయన్ని బుజ్జగించడానికి పార్టీ నాయకులు తంటాలు పడాల్సి వచ్చింది. అద్వానీ కూడా అయిష్టంగానే నరేంద్రమోడీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్వానీ క్రమంగా వాస్తవాన్ని అర్థం చేసుకుని మోడీతో కలసి పనిచేయడం ప్రారంభించారు. మోడీ కూడా ఏ పని చేసినా అద్వానీ సలహా తీసుకుంటూ వచ్చారు.
కాంగ్రెస్‌లోని ఒక వర్గం అద్వానీని మోడీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా అద్వానీ సంయమనం పాటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోంది. ఆ విషయన్ని అద్వానీ సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. ఈ సమయంలో మోడీకి తనలాంటి వ్యక్తి సపోర్ట్ అవసరమని భావించినట్టున్నారు. అందుకే పెద్దమనసు చేసుకుని మోడీకి అనుకూలంగా ప్రకటన చేశారు. ఏదిఏమైనా అద్వానీ ఒక మంచి పని చేశారు.. మంచ మాట చెప్పారు.