సోనియా మంత్రగత్తె: నరేంద్ర మోడీ
posted on Apr 10, 2014 @ 4:46PM
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ‘మంత్రగత్తె’ (Black Magician) గా అభివర్ణించారు. భారతదేశాన్ని గత పది సంవత్సరాలుగా మంత్రగత్తె పరిపాలిస్తోందని ఆయన అన్నారు. అంతకు ముందు సోనియాగాంధీ మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ ఒక మాంత్రికుడిని రంగంలోకి దించింది అని మోడీని ఉద్దేశించి అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మోడీ సోనియాగాంధీని మంత్రగత్తెగా అభివర్ణించారు. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియాని మంత్రగత్తె అన్నప్పుడు సభలో వున్న జనం నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. సదరు మంత్రగత్తె నుంచి తమను తాము కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడటానికి ప్రతి పౌరుడూ ఉద్యమించాలని మోడీ పిలుపు ఇచ్చారు. నేను పేదరికంలో పుట్టాను. పేదల కష్టాలు నాకు తెలుసు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళకి పేదల కష్టాలు, కన్నీళ్ళు ఏం తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.