Read more!

ఆఫ్ఘనిస్తాన్‌లో మలేసియా విమానం?

 

 

 

మలేసియా ఎయిర్‌లైన్స్‌ కి చెందిన ఎంహెచ్370 విమానం అదృశ్యమై నెలరోజులు దాటుతోంది. ఈ విమానం కోసం ఎన్నో దేశాలు వెతుకుతున్నా విమానం ఎక్కడ వుందో ఆచూకీ ఎంతమాత్రం తెలియడం లేదు. అయితే తాజాగా రష్యాకి చెందిన ఇంటెలిజెన్స్ సీక్రెట్ సర్వీస్ సంస్థ ఎఫ్ఎస్‌బి ఈ విమానానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించినట్టు ఎఎన్ఐ వార్తాసంస్థ చెబుతోంది. రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ చెబుతున్నదాని ప్రకారం.... ఇంతవరకూ అందరూ ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఈ విమానం హైజాక్‌కి గురైంది. విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్లు పాకిస్తాన్ సరిహద్దులో వున్న ఆఫ్ఘనిస్తాన్ భూ భాగంలో విమానాన్ని దించారు. విమానంలో వున్న 259 ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. మొత్తం ప్రయాణికులను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందాన్ని ఒక్కోచోట వుంచారు. ప్రయాణికులందరూ మట్టితో చేసిన చిన్న చిన్న పాకల్లో ఆహారం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాగే ఆసియాకి చెందిన 20 మందిని పాకిస్తాన్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బంకర్లలో వుంచారు. రష్యన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ వెల్లడించిన విషయాలు నిజాలా లేక కాకమ్మ కథలా అనే విషయం త్వరలో తెలుస్తుంది.