టీఆర్ఎస్ కు సెకండ్ టెన్షన్.. ఆయనకే గెలుపు అవకాశం?
posted on Mar 19, 2021 8:28AM
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా... రెండు రోజులకు నల్గొండ-ఖమ్మం-మహబూబ్ నగర్ స్థానంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇక్కడ 3 లక్షల 84 వేల ఓట్లు పోల్ కాగా.. ఏడు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. తొలి ఓటులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు.
నల్గొండ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో TRS అభ్యర్థి పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్లు1,10,840. రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. కోదండరామ్ 70072 ఓట్లలో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 39 వేల 107 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఐదో స్థానంలో ఉన్నారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి ఆరో స్థానంలో రాణి రుద్రమ ఏడో స్థానంతో చెరుకు సుధాకర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. నల్గొండ స్థానంలో 21 636 ఓట్లు చెల్లకుండా పోయాయి. తొలి ప్రాధాన్యత ఓటులో తన సమీప అభ్యర్థిమల్లన్న పై....27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి.
నల్గొండ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.రెండో ప్రాధాన్యతలో ఎవరికి మెజార్టీ వస్తుందన్నది కీలకంగా మారింది. మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు పోనూ..మిగితా 98 వేల ఓట్లలో ఎవరికి రెండో ఓటు ఎక్కువగా వస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం పల్లా-మల్లన్నకు 27 550 ఓట్ల తేడా ఉండగా.. పల్లా-కోదండరామ్ కు దాదాపు 40 వేల ఓట్ల తేడా ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో కోదండరామ్ పుంజుకుంటే.. ఆయన తీన్మార్ మల్లన్న కంటే భారీగా ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ లో బీజేపీ అభ్యర్థి రెండో ఓట్లు లెక్కించే సమయానికి మల్లన్నకు కోదండరామ్ క్రాస్ చేస్తేనే ఆయన రేసులో ఉంటారు. లేదంటే ఆయన ఎలిమినేషన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు తొలి ఓటు వేసిన పట్టభద్రులు.. రెండో ఓటు ఎవరికి వేశారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.తొలి ప్రాధాన్యత ఓటులో లీడ్ లో ఉన్నా.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గెలుపుపై ఆందోళన ఉందని తెలుస్తోంది.