వైకాపా.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది..
posted on Nov 10, 2015 @ 10:31AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పెట్టింది పేరుగా తయారైంది. అధికార పక్షంపై ఆందోళనలు చేయడం, ప్రజల మద్దతు కూడగట్టుకోవడం. అయితే అలా అందోళన చేద్దామని వెళ్లిన వైకాపా నేతలకు చుక్కలు కనపడేలా చేశారు గిరిజన ప్రాంత వాసులు. వివరాల ప్రకారం.. బాక్సైట్ తవ్వకాల పై అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వైకాపా ఎమ్మెల్యే ఈశ్వరి.. పార్టీ శ్రేణులు విశాఖ ఏజెన్సీలోని జర్రెలకు వెళ్లి ఆందోళన చేద్దామని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నేతలు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అయితే తమ ఆందోళనకు సంబంధించిన సమాచారం గిరిజనులకు చేరవేయటంలో జరిగిన లోపంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై గిరిజనం అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నేతలు తాము వచ్చింది గిరిజనుల తరుపున పోరాటం చేయడానికి అని చెప్పి.. వారిని ఒప్పించడానికి తలప్రాణం తోకకి వచ్చినంత పనైంది.
అంతేకాదు గిరిజనులు అడిగిన ప్రశ్నకు వైకాపా నేతలకు దిమ్మతిరిగిపోయేంత పనైంది. అదేంటంటే.. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన అన్ రాక్ కంపెనీకి సంబంధించి.. పెన్సా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి జగన్ మేనమామ వరస అవుతారని.. బాక్సైట్ కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోరాడాలంటే.. ముందు కంపెనీనిని మూసేసిన తర్వాత రావాలంటూ అడగటంతో వారు ఏం సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోయారు. మొత్తానికి వైకాపా నేతలు ఏదో చేద్దామనుకుంటే.. ఇంకేదో అయినట్టు ఉంది పరిస్థితి.