లేపాక్షిలో బాలకృష్ణ పూజలు
posted on Mar 11, 2021 @ 10:38AM
ఎమ్మెల్యే బాలకృష్ణకు దైవ భక్తి ఎక్కువ. మహా శివరాత్రి పర్వదినాన బాలయ్య లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే బాలకృష్ణ దంపతులు ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భార్య వసుందరతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతుల రాక సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక స్వాగతం పలికారు. దేవాలయ విశిష్టతను, క్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. బబాలకృష్ణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులుగా హిందూపురంలోనే ఉంటున్నారు బాలయ్య. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు పూర్తి అవడం.. మహా శివరాత్రి రావడంతో అనంతపురం జిల్లాలోనే ఉన్న బాలకృష్ణ.. లేపాక్షి ఆలయాన్ని దర్శించారు. బాలయ్య రాక సందర్భంగా ఆయన్ను చూసేందుకు అభిమానులు, భక్తులు ఆసక్తి కనబరిచారు.